లెనిన్ సక్సెస్ మీట్లో భార్యతో అఖిల్
Akhil with his wife at Lenin Success Meet
పదేళ్లుగా సక్సెస్ కోసం తపన పడిన అక్కినేని అఖిల్ కి లెనిన్ తో బిగ్ రిలీఫ్ దొరికింది. లెనిన్ చిత్రం హిట్ అవడంతో అఖిల్ జోష్ లో కనిపిస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ పట్టరాని ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే నాగార్జున కొడుకు సక్సెస్ గురించి లెనిన్ సక్సెస్ మీట్ లో మట్లాడుతూ అఖిల్ పెళ్లి చేసుకున్నాడు, కలిసొచ్చింది అన్నట్టుగా..
అఖిల్ లెనిన్ రిలీజ్ రోజు ఆయన భార్య జైనాబ్ ఫ్యాన్స్ తో కలిసి లెనిన్ ని వీక్షించింది. గత ఏడాది అఖిల్, జైనాబ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈరోజు జులై 15 న గుంటూరులో లెనిన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం అఖిల్ తన భార్య జైనాబ్ ని మొదటిసారి పబ్లిక్ లోకి తీసుకొచ్చాడు.
లెనిన్ సక్సెస్ ఈవెంట్ లో అఖిల్ తన భార్య జైనాబ్ తో కలిసి సందడి చెయ్యగా.. అఖిల్ ని జంటగా చూసి అభిమానులు చాలా సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం అఖిల్-జైనాబ్ ల జంట ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







































