విశ్వంభరపై మెగా అభిమానుల ఆశ అదొక్కటే!
Vishwambhara release date updateమెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న `విశ్వంభర` చిత్రం విడుదలపై నెలకొన్న సస్పెన్స్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలను ముందుగానే ప్రకటించడం ఆనవాయితీ. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం చిత్రబృందం మౌనం వహిస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఫాంటసీ .. సోషియో-ఫాంటసీ అంశాలు ప్రధానంగా ఉన్నందున అవుట్‌పుట్ అత్యుత్తమంగా రావాలనేది దర్శకుడు వశిష్ట లక్ష్యం.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాలతో క్లాష్ కాకుండా ఉండేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దసరా లేదా సంక్రాంతి వంటి ప్రధాన పండగ సీజన్లలో సోలో రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో,ఇతర పెద్ద సినిమాల రిలీజ్ క్యాలెండర్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ అనిశ్చితికి తోడు డిజిటల్ , ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి కూడా చర్చలు జరుగుతుండటం వల్ల విడుదల తేదీని ఖరారు చేయడంలో కొంత జాప్యం జరుగుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఏది ఏమైనా. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏమాత్రం తక్కువైనా నెగటివ్ టాక్ వచ్చే ప్రమాదం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిస్థాయిలో ముగించుకున్నాకే అధికారిక ప్రకటన చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్‌ను నిరాశపరచకుండా? అన్ని పరి స్థితులను బేరీజు వేసుకుని త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు? కానీ మేకర్స్ ప్రకటిస్తే తప్ప నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే అలాంటి తేదీలు ఎన్నో వచ్చివెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22 చిరంజీవి బర్త్ డే కాబట్టి ఆ రోజు రిలీజ్ పై క్లారిటీ వస్తుందని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.







































