ఏంజిల్ అంత బ్యూటిఫుల్ నిధి

Nidhhi AgerwalNidhhi Agerwal


ఈ హీరోయిన్ కి లక్కు లేదు కానీ.. మిగతావన్నీ చాలానే ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అంటే అందాల నిధి. నిధి అగర్వాల్. అంటే అందం, గ్లామర్, నటన అన్ని ఉన్నాయి. కానీ అదృష్టమే ఆవగింజంత కూడా లేదు. అందుకే హిట్ అనేది అమ్మడుకు ఆమడ దూరంలోనే ఆగిపోతుంది. గత ఏడాది హరి హర వీరమల్లు షాకిస్తే ఈఏడాది మొదట్లోనే ది రాజసాబ్ మరింతగా షాకిచ్చింది.

ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో తెలుగులో రెండు, బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది ఈ మధ్యనే నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇక నిధి అగర్వాల్ సోషల్ మీడియా లుక్స్ గురించి ఎప్పుడు ప్రత్యేకంగా మట్లాడుకునేలా ఉంటాయి. తాజాగా నిధి అగర్వాల్ వదిలిన శారీ లుక్ చూసి వావ్ అంటూ నోరెళ్లబెట్టాల్సిందే.

ఏంజిల్ అంత బ్యూటిఫుల్ గా నిధి అగర్వాల్ లుక్స్ ఉన్నాయి. డిజైనర్ శారీ, డిజైనర్ హెవీ జ్యువెలరీ, లూజ్ హెయిర్, డీప్ నెక్ బ్లౌజ్ లో నిధి అందాలు అలా అలా కనిపిస్తుంటే యూత్ ఆగుతారా.. అందుకే ఆమె అభిమానులు దేవుడా అందం ఇచ్చావు, అంతకు మించి గ్లామర్ ఇచ్చావు, అలాగే ఓ మంచి ఛాన్స్ కూడా ఇప్పించు అంటూ దేవుణ్ణి కోరుకుంటున్నారు.

Nidhhi Agerwal new look viral