ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jr NTR's Team Dismisses Political Entry Rumors

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ క్లారిటీ

Jr NTR's Team Dismisses Political Entry RumorsJr NTR's Team Dismisses Political Entry Rumors

 

గత కొన్ని రోజులుగా పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు రాజకీయ పార్టీలు పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో పలురకాల వార్తలు ప్రచారంలోకి వచ్ఛాయి. దీనికి కారణం అల్లు అర్జున్ ఇప్పటికే అనేక రాష్ట్రాలు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమాన సంఘాల ఏర్పాటు విషయంలో చురుకుగా ఉండడం, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో మీటింగ్ పెట్టడం వెనుక అసలు కారణం రాజకీయాలే అంటూ మాట్లాడుకుంటున్నారు.

తమిళనాడులో పార్టీ పెట్టి విజయ్ చాలా తక్కువ కాలంలోనే సీఎం అయినట్లుగా ఈ ఇద్దరు హీరోల రాజకీయ అడుగులు ఉండబోతున్నాయంటూ ఒకటే ప్రచారం జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊరు వాడ పేరుతొ తన అభిమానుల సహకారంతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దానికి సంబందించిన మీటింగ్ ని ఈ నెల 18 న తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఊరు వాడ పేరుతో దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ మొదలు పెట్టబోతున్నారు. దానితో ఎన్టీఆర్ రాజకీయాలవైపు అడుగులు వేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు, ఆయన త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి.

దానితో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు జూనియర్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై వెంటనే స్పందించి ఖండించాయి. ఈ నెల 18న తిరుపతిలో జరగబోయే ప్రెస్ మీట్ కేవలం తాతగారు ఎన్టీఆర్ స్ఫూర్తితో, ప్రజలకు సేవ చేయాలనే పవిత్ర సంకల్పంతో చేసే సేవా కార్యక్రమాల గురించే తప్ప.. దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. 

Clarity On Jr NTR Political Entry