ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మైనర్‌పై వేధింపులు.. టీవీ నటుడిపై పోస్కో కేసు

బుల్లితెర ప్రముఖ నటుడు రోహిత్ చందేల్ (29)ను ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల మైనర్ బాలికను వేధించడం, వెంబడించడం (స్టాకింగ్), ఫోన్ కాల్స్‌తో వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడనే తీవ్ర ఆరోపణలపై అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది
ఫిర్యాదు ప్రకారం.. సదరు యువతిని రోహిత్ చందేల్ నిరంతరం ఫోన్ చేస్తూ మానసిక క్షోభకు గురిచేసేవాడు. జూలై 5వ తేదీన ముంబై తూర్పు శివారు ప్రాంతంలోని ఆ బాలిక నివాస భవనం వద్దకు వచ్చి..తనను వెంబడించి, గొడవకు దిగాడు. ఆ సమయంలో బాలికను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, చేతులతో ఆమెపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసుల దర్యాప్తు రిపోర్ట్ ఆధారంగా, కోర్టు ఈ వ్యవహారాన్ని విచారిస్తుంది.







































