ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> I asked God for only that one thing – Nagarjuna

దేవుణ్ణి ఆ ఒక్కటే కోరుకున్నా - నాగార్జున

I asked God for only that one thing – NagarjunaI asked God for only that one thing – Nagarjuna


కింగ్ నాగార్జున తన సినిమాల హిట్ కోసం ఎంత పరితపించారో తెలియదు కానీ.. ఆయన తన చిన్న కొడుకు సినిమా హిట్ కోసం చాలా పరితపించారు. కాబట్టే లెనిన్ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భావోద్వేగానికి గురయ్యారు. అఖిల్ ని హీరోగా నిలబెట్టాలని నాగార్జున లెనిన్ విషయంలో ఎంతగా కేర్ తీసుకున్నారో తెరపై కనిపిస్తుంది.

ఆడియన్స్ కి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి లెనిన్ ని నిర్మొహమాటంగా వాయిదా వేశారు. నిన్న విడుదలైన లెనిన్ కి ఆడియన్స్ నుంచి పోజిటివ్ రెస్సాన్స్ వస్తూ ఉండడంతో నాగార్జున పుత్రోత్సాహాన్ని అనుభవిస్తూ ఎమోషనల్ అయ్యారు. అది చూసిన అభిమానులు నాగ్ ని ఎప్పుడూ ఇలా చూడలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు.

తాజాగా లెనిన్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున దేవుణ్ణి తన కోసం ఎప్పుడు కోరుకోలేదు. అఖిలో కోసం ఒక్కటే కోరుకున్నాను అని చెప్పారు. నేను చాలాసార్లు తిరుమల వెళ్ళాను, కానీ ఎప్పుడు దేవుడుని నేను ఏమి కోరుకోలేదు. కారణం నాకు దేవుడు అన్ని ఇచ్చాడు. కానీ అఖిల్ కోసం ఒక్కటే కోరుకున్నాను.

ఈసారి మాత్రం అఖిల్ కి ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు ఇవ్వు అని కోరుకొన్నా. దేవుడు ఇచ్చేసాడు అంటూ నాగార్జున లెనిన్ సక్సెస్ మీట్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు.

Nagarjuna States He Wished and Prayed for Akhil's Lenin