పవన్ కళ్యాణ్ వీరాభిమాని మృతి

Pawan Kalyan Fan Niranjan Passes AwayPawan Kalyan Fan Niranjan Passes Away


రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ చివరి కోరిక తీర్చేందుకు వెళ్లి ఆ బాబు ని పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన అభిమాని నిరంజన్ పవన్ కళ్యాణ్ ని చూడాలనే చివరి కోరికను వెలిబుచ్చగా..

అభిమాని కోరికను మన్నించి పవన్ కళ్యాణ్ స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటూ పూజ చేయించి తీర్థ ప్రసాదాలను అందజేసి.. ఆర్థిక భరోసా ఇచ్చి వచ్చిన 20 రోజులకు నిరంజన్ కన్ను మూసాడు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలనే కోరికతీరిన ఇరవై రోజులకు తుది శ్వాస విడిచాడు.

నిరంజన్ మృతితో హన్మకొండ హనుమాన్ నగర్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.
 

Pawan Kalyan Fan Niranjan Passes Away After Battling Rare Disease