ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi: Prabhas readies for interval blast

హైపెక్కిస్తున్న ఫౌజీ ఇంటర్వెల్ ఎపిసోడ్

Fauzi: Prabhas readies for interval blast


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి ల కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం పై ఏ చిన్న విషయం తెలిసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం అభిమానుల హోప్స్ అన్ని ఫౌజీ పైనే ఉన్నాయి. అయితే ఫౌజీ అప్ డేట్ విషయంలో ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేసున్నారు.

తాజాగా ఫౌజీ ఇంటర్వెల్ బ్యాంగ్‌ గురించిన ఓ న్యూస్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తుంది. రెండు రోజుల్లో టీం హైదరాబాద్ లో వేసిన మెగాస్టార్ ఆచార్య కోసం వేసిన భారీ సెట్ లో ఫౌజీలోని అత్యంత కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తుంది. సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ అని, ఈ యాక్షన్  ఎపిసోడ్ మొత్తం సినిమాకే టర్నింగ్ పాయింట్‌గా నిలిచే ఘట్టమని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాల కన్నా ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్ కి ప్రాధాన్యత ఉంటుంది అని, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఎమోషన్, అలాగే ప్రభాస్‌కు ఇచ్చే ఎలివేషన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఈ న్యూస్ తో మరింతగా పెగడం ఖాయం. 

Prabhas set for Fauzi interval blast