శోభిత ట్రెడిషనల్ లుక్

Sobhita Dhulipala latest look viralSobhita Dhulipala latest look viral



నటి శోభిత దూళిపాళ్ల అక్కినేని నాగార్జున కోడలిగా, నాగ చైతన్య కు భార్యగా ఆ ఇంట అడుగుపెట్టినప్పటినుంచి అటు కెరీర్ ఇటు ఫ్యామిలీ బాధ్యతలను మోస్తుంది. కెరీర్ కోసం ముంబై లోనే ఎక్కువగా ఉంటున్న శోభిత అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళుతుంటే ఆమె ఎయిర్ పోర్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఎక్కువగా ట్రెండీ లుక్స్ తోనే కనిపించే శోభిత దూళిపాళ్ల ఫ్యామిలీ ఈవెంట్స్, లేదంటే ఫెస్టివల్స్ సమయంలో మాత్రం చీర కట్టులో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా శోభిత కాలాతీత గద్వాల్ చీరలో మెరిసింది. గంగ జమున బోర్డర్ లో వైట్ గద్వాల్ శారీ లో శోభిత లుక్స్ సాంప్రదాయంగా ఉన్నాయి.

చేనేత చీరలో శోభిత ను చూసిన వాళ్ళు వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వారసుడిని ఎప్పుడిస్తావ్ అంటూ అడుగుతున్నారు. మరి చైతు-శోభితలు ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాలి. 

Sobhita Dhulipala looks stunning and Stylish