లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్

Lenin OTT Streaming PartnerLenin OTT Streaming Partner


అఖిల్ అక్కినేని లేటెస్ట్ చిత్రం లెనిన్ మరో రెండు రోజుల్లో విడుదలకు రెడీ అవుతుంది. జులై 10 న లెనిన్ విడుదలకు ముహూర్తం కుదిరింది. అంతకుముందు రెండుసార్లు వాయిదా పడిన లెనిన్ పై అంచనాలు భారీగా కనిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున, నిర్మాత నాగవంశీ, ముఖ్యంగా అఖిల్.. లెనిన్ పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

భారీ అంచనాలతో థియేటర్స్ కి వస్తున్న లెనిన్ డిజిటల్ హక్కులు భారీ ధరకు డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. లెనిన్ డిజిటల్ హక్కుల కోసం ఏర్పడిన పోటీలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లెనిన్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా శాటిలైట్ రైట్స్ కూడా జీ సంస్థే తీసుకుందట.

అంటే జీ తెలుగు, జీ సినిమాల్లో లెనిన్ బుల్లితెరపైకి వస్తుంది. ఇక లెనిన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది అని తెలుస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా.. శివాజీ, గెటప్ శ్రీనులు ఇలా పలువురు నటులు భాగస్వామ్యులయ్యారు. 

Akhil Akkineni’s Lenin Bags OTT And Satellite Deal