సెకండ్ వీక్ లో డల్ అయిన పెద్ది

Peddi Second Week performencePeddi Second Week performence


గత గురువారం పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలైన రామ్ చరణ్ పెద్ది చిత్రానికి కామన్ ఆడియన్స్ టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. పెద్ది చిత్రానికి మరీ డివైడ్ టాక్ రాకపోయినా.. సూపర్ హిట్ టాక్ అయితే రాలేదు. రామ్ చరణ్ పెరఫార్మెన్స్ పై వస్తున్న న్యూస్ లు చూసి చాలామంది పెద్దిని థియేటర్స్ లో వీక్షించారు.

కానీ సాధారణ ప్రేక్షకులు పెద్ది ని చూసి అంతగా ఇంప్రెస్స్ అవ్వలేకపోయారు. బుచ్చి బాబు దర్శకత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, జాన్వీ కపూర్ రోల్ ని ప్రత్యక్షంగా హేట్ చేసారు.  ఇక మొదటి వారం పూర్తి చేసుకుని పెద్ది రెండో వారంలోకి ఎంటర్ అయ్యింది. రెండో వారం తెలుగులో పెద్ద సినిమాలేవీ లేవు. అలాగని ఇంట్రస్టింగ్ సినిమాలు లేవు.

దానితో పెద్దికి ఈ వారం అడ్వాంటేజ్ అవుతుంది. ఎలాగో పెద్ది బయ్యర్లు బయటపడిపోతారు అనుకుంటే.. ఈరోజు శుక్రవారం పెద్ది థియేటర్స్ లో పది శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. బాక్సాఫీసు జోరు లేదు. సెకండ్ వీక్ లో పెద్ది బాగా డల్ అయ్యింది అనేది వాస్తవం.

Peddi Enters Second Week