ఫౌజీ మేకర్స్ సైలెన్స్ - ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్

Fauzi movie shooting updateFauzi movie shooting update

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- హను రాఘవపుడిల కలయికలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న ఫౌజీ ముందు ఆగస్టు రిలీజ్ అన్నారు. ఆతర్వాత దశర రిలీజ్ అన్నారు. ఇప్పుడు చూస్తే మేకర్స్ కామ్ గా ఉన్నారు.. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫ్రేష్టేషన్ ఎక్కువైపోతోంది.

ప్రభాస్ అసలు ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసారా, చేస్తే కనీసం ఫౌజీ అప్ డేట్ అయినా వదలొచ్చుగా. ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ షూటింగ్స్ కోసం ఎండలో కష్టపడుతున్నారు అంటున్నారు. కానీ ఫౌజీ నుంచి అప్ డేట్ రావడం లేదు. ఎప్పుడో ఫౌజీ షూటింగ్ 80 పర్సెంట్ కంప్లీట్ అన్నారు. కానీ ఇంతవరకు హడావిడి లేదు.

ఫౌజీ చిత్రం లో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నారు. ఎప్పుడో ఇచ్చిన ఫస్ట్ లుక్ తప్ప ఇప్పటివరకు ఫౌజీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ రాలేదు. అలాగే విడుదల ఈ ఏడాది ఉంటుందా, లేదంటే అనేది తేలడం లేదు. ఫౌజీ దసరా నుంచి డిసెంబర్ కి వెళ్లొచ్చనే ఊహాగానాలు ఎప్పటినుంచో నడుస్తున్న దానిపై మేకర్స్ నో క్లారిటీ.

అదే ప్రభాస్ ఫ్యాన్స్ కి మంటెత్తిపోయేలా చేస్తుంది. రాజా సాబ్ డిజాస్టర్ ని ఫౌజీ తో మరిపించేలా చెయ్యాలనేది ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక. కానీ ఫౌజీ సైలెన్స్ వాళ్లకు కునుకు రానివ్వడం లేదు. 

Fauzi update