Advertisement

పెద్ది డే 5 కలెక్షన్స్

Peddi day 5 collections


రామ్ చరణ్ పెద్ది చిత్రం విడుదలైన రోజు నుంచి ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి అంటే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ముందు నుంచి పెద్ది చిత్రం పై అంచనాలున్నాయి. విడుదలయ్యాక కూడా పెద్ది కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కనిపించిన కలెక్షన్స్ పరంగా జోరు కనిపించింది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది చిత్రానికి కలెక్షన్స్ బాగా రావడం ప్లస్ అయ్యింది. ఇక సోమవారం పెద్ది బాక్సాఫీసు పెరఫార్మెన్సు గురించి ఎవరెన్ని మట్లాడినా.. ఇండియాలో ఏకంగా రూ.12.05 కోట్ల నెట్ కలెక్షన్లను పెద్ది చిత్రం రాబట్టింది.

వర్కింగ్ డే రోజున దేశవ్యాప్తంగా ఉన్న 7,904 షోలలో ఈ చిత్రం 28 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి. సో సోమవారం కూడా పెద్ది కి మంచి కలెక్షన్స్ వచ్చినట్టే. మండే టెస్ట్ పాస్ అయినట్లే.

 

Peddi collections report