నార్త్ లో పుంజుకోని పెద్ది
Peddi North Performence
ఈ గురువారం పాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ పెద్ది చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కర్ణాటక లాంటి భాషల్లో ఓపెనింగ్స్ అద్దరగొట్టినా.. నార్త్ లో పెద్ది సరైన ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. ఆర్.ఆర్.ఆర్ తో బలమైన మార్కెట్ సెట్ చేసినా సోలో గా రామ్ చరణ్ పెద్ది చిత్రంతో మాత్రం ఓపెనింగ్స్ పరంగా వెనుకపడ్డాడు.
కేజిఎఫ్, పుష్ప సీక్వెల్స్ కి నార్త్ లో దుమ్మురేపే ఓపెనింగ్స్ వచ్చినా పెద్ది స్ట్రయిట్ సినిమా కావడం, స్పోర్ట్స్ డ్రామాలు వచ్చెయ్యడంతో పెద్ది ని మొదటిరోజు చూసేందుకు నార్త్ ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. టాక్ ని బట్టి థియేటర్స్ కి వెళదామనుకుంటే.. పెద్దికి బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ప్రేక్షకులు సినిమాకు కరువాసిపోయి ఉన్నారు. అంతేకాకుండా గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత పెద్ది రావడంతో మెగా ఫ్యాన్స్ పెద్ది ని హిట్ చేయాలనీ కసిగా కనిపించారు. అయితే మొదటిరోజు ఎలా ఉన్నా రెండో రోజు కూడా నార్త్ లో పెద్ది పుంజుకోలేదు. నార్త్ లో ఈ వీకెండ్ బుకింగ్స్ అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి.
శనివారం చాలా వీక్ గా పెద్ది బుకింగ్స్ ఉన్నాయి. ఆదివారం కూడా పెద్ది నార్త్ పెరఫార్మెన్స్ అంతమాత్రంగానే కనిపిస్తుంది.







































