ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Buchi Babu about Charan-Janhvi chemistry

చ‌ర‌ణ్‌-జాన్వీ ముద్దుపై డైరెక్ట‌ర్ వివ‌ర‌ణ‌!

Buchi Babu about Charan-Janhvi chemistry


`పెద్ది` థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తుంటే? సోషల్ మీడియా వేదికగా మాత్రం  ఊహించని వివాదంలో చిక్కుకుంది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రను డిజైన్ చేసిన విధానం -ఆమెకు సంబంధించిన కొన్ని రొమాంటిక్ సీన్స్ పై నెటిజన్లు, సినీ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్రంలోని మొదటి భాగంలో వచ్చే ఒక ముద్దు సన్నివేశం నెట్టింట తీవ్రమైన చర్చకు మరియు ట్రోలింగ్‌కు దారితీసింది.

కథా ప్రవాహానికి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా? హీరోయిన్ ప్రమేయం లేదా ఇష్టం లేకపోయినా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకునేలా ఆ సీన్‌ను చిత్రీకరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.  సదరు సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్ సైతం ఆమె పాత్రలోని భావవ్యక్తీకరణను కాకుండా కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుగా శారీరక భాగాలపై ఎక్కువగా ఫోకస్ చేయడాన్ని ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. స్త్రీ నిరాకరణను గౌరవించకుండా వేధింపులను సరదా రొమాన్స్ గా  చూపించే ఇలాంటి ధోరణులు నేటి సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తాయని మహిళా సంఘాలు -  విమర్శకులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

ఈ వివాదం వైరల్‌గా మారడంతో దర్శకుడు బుచ్చిబాబు సన దీనిపై స్పందించారు. ఈ సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి ఇంత స్థాయిలో ప్రతికూల స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని అంగీకరించారు. రామ్ చరణ్- జాన్వీ కపూర్‌ల మధ్య కేవలం  ఆహ్లాదకరమైన- సరదాగా సాగే ప్రేమకథను , వినోదాన్ని ఆవిష్కరించాలనే ఉద్దేశంతోనే ఆ సీన్లు రూపొందించామని వివరించారు. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను,  వారి అభిప్రాయాలను తాము పూర్తిగా గౌరవిస్తున్నామని.. భవిష్యత్తులో కథలు రాసేటప్పుడు మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా, మెరుగ్గా తెరకెక్కించే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని వివ‌ర‌ణ ఇచ్చారు.

Buchi Babu has responded to the criticism surrounding certain scenes involving RC and Janhvi has responded to the criticism surrounding certain scenes involving RC and Janhvi