ఇంకా ప్రమోట్ చేసుంటే బ్లాస్ట్ బస్టర్ అయ్యేది

Blast Zone box office performanceBlast Zone box office performance


కొన్నేళ్లుగా అర్జున్ మార్కెట్ పడిపోయింది. ఆయన నటించిన సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను సినిమాలు చేసిన అర్జున్ ఇంపాక్ట్ అంతగా కనిపించలేదు. కానీ అనూహ్యంగా అర్జున్ లేటెస్ట్ మూవీ బ్లాస్ట్ జోన్ అనుకోకుండా హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈమధ్య కాలంలో క్రిటిక్స్ ఏ సినిమాకి ఇవ్వని రేటింగ్స్ బ్లాస్ట్ జోన్ కి ఇచ్చారు. కానీ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేదు. బ్లాస్ట్ జోన్ బావుంది కానీ ఆడియన్స్ థియేటర్స్ లో కనిపించడమే లేదు. కారణం బ్లాస్ట్ జోన్ కి పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం. సూర్య కరుప్పు, మోహన్ లాల్ దృశ్యం 3 డివైడ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.

కారణం సూర్య, మోహన్ లాల్ నోటెడ్ స్టార్ హీరోలు. కాని అర్జున్ అలా కాదు. అందుకే అవి హిట్ కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. కానీ హిట్ అన్న బ్లాస్ట్ జోన్ కి కలెక్టన్స్ నిల్. ఇంకా సినిమాని బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ లోకి తీసుకెళ్లి ఉంటె నిజంగా బ్లాస్ట్ జోన్ బ్లాస్ట్ బస్టర్ హిట్ అయ్యేది.
 

Blast Zone Movie collections report