ఇక్కడా పవన్ కి సపోర్ట్ లేదు
Pawan Kalyan Telangana press Meet
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ పెట్టినప్పుడు టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ సపోర్ట్ గా ఆయన దగ్గరకు వెళ్ళలేదు, జనసేన పార్టీలో చేరలేదు. పదేళ్లు పోరాడి గెలిచిన పవన్ ఏపీ కి డిప్యూటీ సీఎం అయ్యాక కూడా టాలీవుడ్ నుంచి ఎవరూ వెళ్లి ఆయన పార్టీలో చేరలేదు. జబర్దస్త్ గ్యాంగ్ మాత్రం పార్టీకి ప్రచారం చేసారు.
ఇక ఇప్పుడు తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి ఓ సభ నిర్వహించి ఇక్కడ యాక్టీవ్ అవ్వాలని చూసారు. అందులో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ లోని తన ఇంటిలోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ దగ్గరకు టాలీవుడ్ వాళ్ళు ఎవరెవరు హాజరవుతారా అనే క్యూరియాసిటీ చాలామందిలో కనిపించింది.
అయితే మొగలిరేకులు సాగర్, తనీష్ లాంటి చిన్న నటులు తప్ప పవన్ ప్రెస్ మీట్ లో ఆయన పక్కన ఎవరూ కనిపించలేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్ట్రాంగ్.. ఈమద్యలో పవన్ వచ్చి పార్టీ అంటే ఎవరు జాయిన్ అవుతారనే ప్రశ్న అందరిలో తలెత్తింది.
అది నిజమే ఏపీలోనూ పవన్ కళ్యాణ్ జనసేన తో ఇంకా బలమైన పునాది వెయ్యలేదు. అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ కి వచ్చి పార్టీ గురించి మాట్లాడితే సినిమా వాళ్లు పవన్ కి సపోర్ట్ చేసే ధైర్యం చేస్తారా.. !







































