రణ్వీర్ పై బ్యాన్ - కోర్టుకెళ్లిన వ్యవహారం
Ranveer Singh row reaches court
బాలీవుడ్ లో నటుడు రణ్వీర్ సింగ్ పై ఎఫ్ డబ్ల్యూఐసీ బ్యాన్ విధించడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ డాన్ 3 వ్యవహారంలో ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో మొదలైన వివాదం రణ్వీర్ సింగ్ బ్యాన్ వరకు వెళ్ళింది. మూడేళ్లపాటు రణ్వీర్ తో ఎవరూ సినిమా చెయ్యకూడదని చెప్పింది.
అయితే రణ్వీర్ పై బ్యాన్ విధించడం ఎంతవరకు సమంజసం.. హీరో-దర్శకుడు-నిర్మాతలు సమన్వయంతో పని చేసుకోవాలి కానీ ఇలా ఒక నటుడిని బ్యాన్ చేయడమేమిటి అంటూ బాలీవుడ్ నిర్మాత ఒకరు కోర్టు కెక్కడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రముఖ నిర్మాత టీపీ అగర్వాల్ రణ్వీర్ సింగ్ విషయంలో కోర్టులో పిటిషన్ వేశారు.
అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎవరిని నిషేధించే అధికారం లేదు. మరి అలాంటి హక్కు FWICE లాంటి సంస్థలకు ఎవరిచ్చారు. గతంలో నేను, దర్శకుడు విపులా కలిసి ఇలాంటి ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాము. సినిమా ఇండస్ట్రీ అనేది పరస్పర సహకారంతో నడిచే ఓ సృజనాత్మక వేదిక.
ఇలాంటి సెన్సిటివ్ విషయాలను చట్టపరమైన, వృత్తిపరమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. ఒక వ్యక్తితో ఎవరూ పనిచేయకూడదంటూ బలవంతం చేయడం లాంటి చర్యలను తేలికగా తీసుకోకూడదు. అందుకే ఈ వ్యవహారాలను పారదర్శకంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలి.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు.







































