రామ్ చరణ్ చేతికి సర్జరీ

Vijayawada Peddi event highlights


పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది రేపు బుధవారం అంటే జూన్ 3 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో హడావిడి చెయ్యడానికి సిద్దమైపోతుంది. విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ప్లాన్ చేసారు మేకర్స్. పెద్ది కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది ఈ ఈవెంట్ చూస్తే అర్ధమవుతుంది.

విజయవాడ వేడికి చమటలతో తడిచిపోయినా మెగా ఫ్యాన్స్ ఈవెంట్ వేదిక నుంచి కదల్లేదు. ఇక రామ్ చరణ్ పెద్ది చిత్ర షూటింగ్ లో మూడుసార్లు గాయపడిన విషయం పెద్ది ప్రమోషన్స్ లో వింటున్నాం. ప్రస్తుతం కూడా రామ్ చరణ్ చేతికి కట్టుతో కనిపిస్తున్నారు. అయితే పెద్ది విజయవాడ ఈవెంట్ లో రామ్ చరణ్ డెడికేషన్ గురించి మట్లాడుతూ ఈ చిత్రం కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారు.

ఆయన చేతికి దెబ్బ తగిలింది, వచ్చే నెలలో ఆ చేతికి ఆయన సర్జరీ చేయించుకుంటారనే విషయం రివీల్ అయ్యింది. సో పెద్ది విడుదల తర్వాత రామ్ చరణ్ చేతికి సర్జరీ చేయించుకుని కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాతే సుక్కు మూవీ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.

Peddi pre release event