Loading...

మళ్లీ మంచు బ్రదర్స్ మధ్య పోటీ

Dasari Narayana Rao's samadhi cleaned


లెజెండరీ డైరెక్టర్, నటుడు, నిర్మాత దాసరి నారాయణ రావు గారు పరమపదించి ఎన్నో ఏళ్ళు గడుస్తుంది. సినిమా పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరించిన దాసరి సమాధి దీనావస్థలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన అనేకమంది అభిమానులు చలించిపోయారు.

అందులో మంచు హీరోలైన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా వున్నారు. మంచు అన్నదమ్ములు ఆస్తుల విషయంలో గొడవపడినప్పటికి దాసరి విషయంలో ఇద్దరూ ఒకే విధంగా స్పందించడం విశేషం. దాసరి నారాయణరావు మంచు ఫ్యామిలీకి ఏంతో సన్నిహితుడు. మంచు మోహన్ బాబు - దాసరి నడుమ ఎంతో అన్యోన్య సంబంధము ఉంది.

సోషల్ మీడియాలో దీనావస్థలో ఉన్న దాసరి సమాధి వీడియో చూసి చలించిపోయిన మంచు విష్ణు తమ తమ టీం ని పంపించి సమాధి ని శుబ్రపరిచిన వీడియోస్, మంచు మనోజ్ తానే స్వయంగా వెళ్లి సమాధి శుభ్రపరుస్తున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా.. దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. దాసరి నారాయణరావు గారు తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో దోహదపడ్డారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగి సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేయసారు.

అంతే కాదు ఈరోజు ఉదయమే మనోజ్ తన సినిమా షూటింగ్‌కి వెళ్లే ముందు ఉదయం 7:00 గంటలకల్లా తన బృంద సభ్యులతో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్ని చూసి చాలా బాధపడ్డాను. చిత్రపురి కాలనీ దాటుతుండగా, ఆయన విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. ఆ వీడియో మా టీం నాకు చూపించడంతో అసలు విషయం తెలిసింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను తట్టుకోలేకపోయాను. అందుకే దీనికి ప్రాధాన్యతనిచ్చి, నా షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చాను అని అన్నారు.

ఇక మంచు విష్ణు కూడా దాసరి నారాయణరావు స్మారక స్థలం శిధిలావస్థలో ఉందని చూపించిన ఒక వీడియోను చూసిన వెంటనే స్పందించి.. ఆలస్యం చేయకుండా తన బృందాన్ని అక్కడికి పంపించి, స్మారక స్థలం పరిసరాలను శుభ్రపరచడంతో పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. వారి చొరవతో ఆ ప్రదేశం తిరిగి పరిశుభ్రంగా, గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది.

సో మంచు బ్రదర్స్ మళ్లీ దాసరి విషయంలో కూడా ఒకరికోరు పోటీపడడం హాట్ టాపిక్ అయ్యింది. 

Manchu Manoj cleaned dasari Narayana rao samadhi