Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Drishyam 3 days world wide collections

మూడు రోజుల్లో సెంచరీ కొట్టిన మోహన్ లాల్

Drishyam 3 days world wide collections


డివైడ్ టాక్ తో మూడు రోజుల్లో సెంచరీ దాటించేసారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. గత గురువారం విడుదలైన మోహన్ లాల్-జీతూ జోసెఫ్ ల దృశ్యం 3 చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. దానితో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 యావరేజ్ కేటగిరికి వేసేసారు క్రిటిక్స్.

కానీ మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన దృశ్యం 2 మలయాళ అలాగే ఇతర భాషలకన్నా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పుడు మొదటి వీకెండ్ గడవకముందే అంటే మొదటి మూడు రోజులకే దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రూ. 117.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది.

ఇక ఈరోజు సండే కూడా దృశ్యం 3 థియేటర్ ఆక్యుపెన్సీ బావుంది. దృశ్యం సీరీస్ లో మొదటి రెండు భాగాలతో పోలిస్తే, మూడో భాగంలో సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తగ్గాయని.. కాకపోతే ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎలా ఉన్న దృశ్యం 3 మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి మలయాళ సినీ చరిత్రలో కొత్త రికార్డులు నమోదు చేస్తుంది.

Drishyam 3 collections