Loading...

జన నాయగన్ కొత్త రిలీజ్ డేట్

Jana Nayagan new release date soon


కోలీవుడ్ స్టార్ హీరో కమ్ సీఎం విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి ఎప్పటికి మోక్షం కలుగుతుంది. గత ఐదు నెలలుగా జన నాయగన్ చిత్ర విడుదల కోసం వెయిట్ చేస్తున్న విజయ్ అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుంది. CBFC జన నాయగన్ కి సెన్సార్ సర్టిఫికెట్ ఎప్పుడు జారీ చేస్తుంది. విజయ్ సీఎం అయ్యాక కూడా జన నాయగన్ కష్టాలు తీరడం లేదు.

తాజాగా జన నాయగన్ కొత్త రిలీజ్ డేట్ కోసం మేకర్స్ చూస్తున్నారట. సాలిడ్ సమ్మర్ మే నెల ను వదిలేసుకున్న జన నాయగన్ జూన్ విడుదల లాక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 22 న విజయ్ బర్త్ డే. అంతకుముందే అంటే జూన్ 19 న జన నాయగన్ విడుదల చెయ్యాలని నిర్మాతలు చూస్తున్నారట.

ఇంటికే కొన్ని యాప్స్ లో జన నాయగన్ టికెట్ బుకింగ్స్ అవైలబుల్ లోకి రావడంతో జూన్ 19 నే జన నాయగన్ విడుదల ఉంటుంది అని, అయితే మేకర్స్ ఇచ్చే అధికారిక ప్రకటన కోసమే విజయ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. 
 

Vijay's Jana Nayagan new release date