Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tiny Tom calls Ansiba Hassan’s allegations baseless amid AMMA row

స‌హ‌న‌టుడు క‌క్ష సాధింపుపై న‌టి ఫిర్యాదు

Tiny Tom calls Ansiba Hassan’s allegations baseless amid AMMA row

 

పోటీరంగంలో క‌క్ష సాధింపుల వ్య‌వ‌హారాలు ఒక్కోసారి అసోసియేష‌న్ ప‌రువును కూడా బ‌జారుకు ఈడుస్తుంటాయి. ఇన్న‌ర్ పాలిటిక్స్ ని బ‌హిరంగంగా వ్యాఖ్యానించేవారికి ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు ఇవ్వ‌డం కూడా క‌ష్టమే. ఈ త‌ర‌హాలో ఇప్ప‌టికే ఆరోపించి చాలామంది న‌టీమ‌ణులు శిక్ష‌లు అనుభవిస్తున్నారు. మీటూ స‌మ‌యంలో స‌హ‌న‌టుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన ఒక్క న‌టీమ‌ణికి కూడా ఇంత‌వ‌ర‌కూ అవ‌కాశాలొచ్చిన సంద‌ర్భాల్లేవ్.

ఇప్పుడు మ‌రో న‌టి ఇలా బ‌హిరంగంగా త‌న స‌హ‌చ‌రుడిపై వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మాలీవుడ్ ఆర్టిస్టుల సంఘంలో ఇది క‌ల‌క‌లం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే మ‌ల‌యాళ ఆర్టిస్టుల సంఘం (అమ్మా)లో న‌టి అన్సిబా హాస‌న్ తాజా ఫిర్యాదుపై విచార‌ణ సాగుతోంది. అన్సిబా ఇటీవ‌ల దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాల‌లో త‌న అద్బుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఆర్టిస్టుల సంఘం (అమ్మా) సంయుక్త కార్య‌ద‌ర్శిగాను కొన‌సాగుతున్నారు. కానీ త‌న స‌హ‌చ‌రుడైన న‌టుడు టిని టామ్ త‌న‌పై క‌క్ష క‌ట్టి త‌ప్పుడు ప్రచారం చేస్తున్నాడ‌ని, అక్ర‌మ సంబంధాలు అంట‌గ‌ట్టి త‌న‌పై బురద జ‌ల్లుతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతేకాదు త‌న‌ను మ‌తం పేరుతో వేధించాడ‌ని, త‌న‌ను జిహాదీ అని అంటున్నాడ‌ని కూడా ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై ప్ర‌స్తుతం అమ్మా విచార‌ణ జ‌రిపి న్యాయం చేయాల్సి ఉంటుంది.

అయితే తాను అసోసియేష‌న్ లో జాయింట్ సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు చేపట్టిన క్ర‌మంలోనే టినీ టామ్ త‌న‌పై ఇలా క‌క్ష క‌ట్టి త‌ప్పుడు ప్ర‌చారాల్ని తెర‌పైకి తెచ్చాడ‌ని కూడా ఆవేద‌న చెందారు న‌టి అన్సిబా. గ‌త ఏడాది అమ్మా ఫ్యామిలీ గెట్ టుగెద‌ర్ త‌ర్వాత అన్సీబా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి కార‌ణం ఇలాంటి ఒత్తిళ్లేన‌ని కూడా చెప్పారు.

Malayalam actor Ansiba Hassan resigns from AMMA