Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Chaitanya confidence is next level!

నాగ చైత‌న్య కాన్పిడెన్స్ నెక్స్ట్ లెవ‌ల్!

యువ సామ్రాట్ నాగ చైత‌న్య హీరోగా 24 సినిమాల్లో న‌టించాడు. వాటిలో కొన్ని విజ‌యాలు సాధించాయి. మ‌రికొన్ని అనుకున్న విధంగా  ఫ‌లితాలు సాధించ‌లేదు. ప్ర‌తీ సినిమా విష‌యంలో హీరోలు ఎంతో కాన్పిడెంట్ గా ఉంటారు. ఆ న‌మ్మ‌కం ఒక్కోసారి నిల‌బ‌డుతుంది. మ‌రికొన్నిసార్లు నిల‌బ‌డ‌దు. బాగా న‌మ్మ‌కంగా ఉన్న సినిమాలు  ఫెయిలైతే మాత్రం ఇంకొంచెం పెయిల్యూర్  పెయిన్ ఎక్కువ‌గా ఉంటుంది.

ప్ర‌స్తుతం నాగ చైత‌న్య హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో `వృష‌క‌ర్మ` అనే మిస్టిక‌ల్  థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓ గుహ నేప‌థ్యంలో రూపొందుతుంది. ఇందులో చైత‌న్య సాహ‌స‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్ష‌కులుల్ని ఆక‌ట్టుకుంటుంది.  ఈ సినిమాను ఉద్దేశించి నాగ‌చైత‌న్య చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

త‌న కెరీర్ లోనే `వృష‌క‌ర్మ` ఉత్త‌మ చిత్రంగా నిలుస్తుంద‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సినిమాపై ఎంతో న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌రు. దీంతో `వృష‌క‌ర్మ‌`పై నాగ చైత‌న్య ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడు అన్న‌ది అద్దం ప‌డుతుంది. గ‌తంలో చాలా సినిమాల్లో న‌టించాడు ఏ సినిమాకు ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

`మ‌జిలీ`, `తండేల్`, `ల‌వ్ స్టోరీ` ఇలా కొన్ని క్లాసిక్ చిత్రాలున్నాయి. క‌మ‌ర్శియ‌ల్ గానూ మంచి విజ‌యం సాధించాయి. కానీ  ఆ సినిమాల రిలీజ్ ముందు చైత‌న్య ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో `వృష‌క‌ర్మ` ఎంత ప్ర‌త్యేక‌మ‌న్న‌ది అద్దం ప‌డుతుంది.

Naga Chaitanya

Naga Chaitanya confidence is next level!
naga chaitanya