Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Crucial Meeting: Allu Arjun and Lokesh Kanagaraj

బన్నీ వెంటపడుతున్న కోలీవుడ్ డైరెక్టర్స్

Crucial Meeting: Allu Arjun and Lokesh Kanagaraj

 పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీస్ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ హీరోగా మారిన అల్లు అర్జున్ పుష్ప హిట్స్ తర్వాత తన ప్లాన్స్ మొత్తం మార్చేసి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాడు, అనౌన్సమెంట్ వీడియో తోనే ఇంటర్నేషనల్ రేంజ్ చూపించిన అల్లు అర్జున్ - అట్లీ లు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా వున్నారు. 

ఈలోపే అల్లు అర్జున్  నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై బన్నీ వాస్ అదిరిపోయే అప్ డేట్స్ ఇచ్చారు. అయితే మరో కోలీవుడ్ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చి మరీ అల్లు అర్జున్ ని మీటయ్యి కథ వినిపించారనే టాక్ వైరల్ గా మారింది. ఆయనెవరో కాదు తమిళనాట స్టార్ డైరెక్టర్, కూలి తో డిజప్పాయింట్ చేసిన లోకేష్ కనగరాజ్.. 

లోకేష్ కనగరాజ్ నిన్న హైదరాబాద్ వచ్చి సాయంత్రం అల్లు అర్జున్ ని కలిసి కథ వినిపించిన విషయం లీకైంది. లోకేష్ కనగరాజ్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన విజువల్స్ చూసాక ఆయన అల్లు అర్జున్ ని కలిసారని అంటున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్ ఒక్కొక్కరుగా ఇలా అల్లు అర్జున్ తో సినిమా కోసం ట్రై చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

Lokesh Kanagaraj narrates story to Allu Arjun

lokesh kanagaraj