వారణాసి: మహేష్ కి షాకింగ్ రెమ్యునరేషన్

 Mahesh Babu Pay for VaranasiMahesh Babu Pay for Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు మొట్టమొదటిసారి దర్శకధీరుడు, పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో చేస్తున్న మూవీ వారణాసి. రీసెంట్ గానే వారణాసి టైటిల్ గ్లింప్స్ ని #GlobeTrotter ఈవెంట్ లో రివీల్ చేసారు. 2027 సమ్మర్ లో సినిమా రిలీజ్ అనే అప్ డేట్ కూడా అదే ఈవెంట్ లోనే రివీల్ అయ్యింది.

ఈ సినిమాలో 30 నిమిషాల మహేష్ యాక్షన్ సీక్వెన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులను ఎగ్జైట్ చేసాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ సాహసాలు, యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటాయో అనేది ఆల్మోస్ట్ వారణాసి టైటిల్ టీజర్ లోనే రాజమౌళి చూపించేసారు.

అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కి నిర్మాతలు ఏకంగా 200 కోట్ల పారితోషికం ఇస్తున్నారనే వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరోపక్క ఆయన ఏడాదికి 75 కోట్ల పారితోషికం చొప్పున అందుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఏది ఎలాగున్నా మహేష్ ఈ చిత్రానికి 150 కోట్ల పైమాటే  పారితోషికం కింద అందుకుంటున్నారనే మాట మహేష్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

A massive deal for Mahesh Babu For Varanasi

varanasi