బాలయ్య తో స్టెప్స్-ఆ లక్కీ హీరోయిన్ ఎవరో?
Akhanda 2 Special Song Planningనందమూరి నటసింహ బాలకృష్ణ సినిమాల్లో కొన్నాళ్లుగా ఆయన హీరోయిన్స్ తో వేస్తున్న స్టెప్స్ పై సోషల్ మీడియాలో చాలారకాల కామెంట్స్ కనిపిస్తున్నాయి. వీర సింహ రెడ్డి లో హాని రోజ్ తో బాలయ్య వేసిన డాన్స్ పాపులర్ కాగా.. రీసెంట్ గా డాకు మహారాజ్ లో ఊర్వశి రౌతేల్ల తో బాలయ్య వేసిన మాస్ స్టెప్స్ కాంట్రావర్సీ అయ్యాయి.
అయితే బాలయ్య తో బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ 2 కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 25 దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న అఖండ 2 లో బాలయ్య సరసన ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా.. ఇప్పుడు అఖండ 2 కోసం బాలయ్య సరసన స్టెప్స్ వేసేందుకు రాబోయే హీరోయిన్ పై అందరిలో ఆసక్తి మొదలైంది.
ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ ని బోయపాటి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు. ఆగస్టు నాటికి అఖండ తాండవం షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఆయన చిత్రీకరణ జరుపుతున్నారు. ఆతర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో మరో మూవీకి కమిట్ అయ్యి అనౌన్సమెంట్ ఇచ్చేసారు.
Akhanda 2 Thaandavam Special Song Planning







































