చైతు కోసం శోభిత-శోభిత కోసం చైతు
Naga Chaitanya on weekend customs with Sobhita Dhulipalaనాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5 న అన్నపూర్ణ స్టూడియో లో చైతు-శోభిత ల వివాహం అంగరంగ వైభవముగా జరిగింది. ఆ తర్వాత నాగ చైతన్య తండేల్ తో బిగ్ హిట్ కొట్టాడు. ఇక శోభిత ఫోటో షూట్స్, షూటింగ్ అంటూ ఎక్కువగా ముంబై లోనే స్పెండ్ చేస్తుంది.
సమయం దొరికినప్పుడల్లా చైతు-శోభిత లు వెకేషన్ అంటూ ట్రిప్స్ వేస్తున్నారు. అఖిల్ పెళ్ళిలో ఫ్యామిలీ తో కలిసి స్పెండ్ చేసిన ఈ జంట వీకెండ్స్ ని స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారట. చైతు షూటింగ్స్ తో హైదరాబాద్ లో ఉంటే శోభిత ముంబై లో ఉంటుంది. అందుకే వీకెండ్స్ కోసం చైతు-శోభితలు ఇలా స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.
వీకెండ్ లో కలిసినపుడు ఎక్కువగా స్పెషల్ గా ప్లాన్ ఏం చేసుకోపోయినా.. ఒక వారం ఒకరి కోసం మరొకరికి ఇష్టమైనట్టుగా ఉండడం చేస్తూ ఉంటారట. ఏది చేసినా కలిసే చేస్తామని, ఒక వారం చైతుకి ఇష్టమైనట్టుగా శోభిత ఉంటుందట. అలా చైతూకి ఇష్టమైన రేసింగ్ ట్రాక్ కి శోభితను తీసుకెళ్లాడట. మరో వారం శోభితకు ఇష్టమైనట్టుగా బుక్స్ చదివేందుకు చైతు ట్రై చేస్తూ ఉంటాడట. అదన్నమాట చైతు-శోబితలు ఒకరికోసం మరొకరు నచ్చినట్టుగా వీకెండ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
Naga Chaitanya Reveals His Sacred Weekend Ritual With Wife Sobhita






































