విజ్జు నిన్ను గర్వపడేలా చేస్తా-రష్మిక
Rashmika promises to make Vijju proud as rumoured boyfriend Vijay Devarakondaవిజయ్ దేవరకొండ-రష్మిక నడుమ సమ్ థింగ్ సమ్ అంటూ ప్రచారమే జరగడమే కాదు.. అందుకు తగ్గట్టే రష్మిక-విజయ్ దేవరకొండ లు లంచ్ డేట్ ఇంకా వెకేషన్స్ అంటూ తిరుగుతుంటారు. సీక్రెట్ వెకేషన్ అయినా మీడియా ఎలాగో రష్మిక-విజయ్ దేవరకొండ విషయాన్నీ పసిగట్టేస్తుంది. ఇక ఒకరి సినిమా అప్పుడు మరొకరు సోషల్ మీడియాలో విషెస్ చెప్పుకుంటూవుంటారు.
తాజాగా రష్మిక మందన్న నుంచి మైస అంటూ హీరోయిన్ సెంట్రిక్ పోస్టర్ వచ్చింది. అందులో రష్మిక చాలా కొత్తగా డిఫ్రెంట్ గా అనిపించింది. రష్మిక మైస పోస్టర్ పై చాలామంది సెలబ్రిటీస్ స్పందించారు. కానీ విజయ్ దేవరకొండ స్పందన మాత్రం తెగ హైలెట్ అయ్యింది. దానికి రష్మిక ఇచ్చిన రిప్లై మరింతగా ట్రెండ్ అయ్యింది.
ఇది అద్భుతంగా ఉండనుంది అంటూ మైస పోస్టర్ ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా దానికి రష్మిక మందన్న విజ్జు ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తాను అంటూ రిప్లై ఇవ్వడంతో.. రష్మిక విజయ్ ను అంత క్లోజ్ గా విజ్జు అంటూ పిలవడం వెనుక ఇంకేం ఉంటుంది అది ప్రేమే అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.
Vijjuuuu Rashmika Madanna promise to Vijay Devarakond








































