రెండో కొడుకును పరిచయం చేసిన ఇలియానా

Ileana introduces her second sonIleana introduces her second son

గోవా బ్యూటీ ఇలియానా తన రెండో కొడుకుని పరిచయం చేసింది. రీసెంట్ గానే జూన్ 19 న రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా ఇప్పుడు తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. మా గుండెలు ఆనందంతో నిండిపోయాయి అంటూ క్యాప్షన్ జోడించింది. 

ఒకసారి ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో  బెడిసి కొట్టాక డిప్రెషన్ లోకి వెళ్లిన ఇలియానా ఆతర్వాత మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి విషయాన్ని బయటపెట్టలేదు. 2023లో ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆతర్వాతే ఆమె తన భర్తను పరిచయం చేసింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం బేబీ బంప్ ఫోటోస్ పంచుకుంది. 

రెండోసారి తను ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపింది. ఇప్పుడు మరోసారి పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు చెబుతూ తన కొడుకు ఫోటోస్ షేర్ చేసింది. తన రెండో బిడ్డకు కేను రాఫే డోలన్ అని పేరు పెట్టింది. ఇలియానా మొదటి కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్. 

Ileana announces birth of second son Keanu Rafe

ileana