పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ పోస్ట్

Akhil first post after marriageAkhil first post after marriage

అక్కినేని అఖిల్ పెళ్ళై దాదాపుగా 20 రోజులు పైనే అయ్యింది. జూన్ 6 న నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్-జైనాబ్ ల వివాహాన్ని సింపుల్ గా జరిపించినా.. జూన్ 8 హైదరాబాద్ లో అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ ని మాత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అఖిల్ రిసెప్షన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి సెలబ్రిటీస్ హాజరయ్యారు. 

గత ఏడాది నవంబర్ లోనే అఖిల్-జైనాబ్ ల నిశ్చితార్దాన్ని హైదరాబాద్ లోనే నిర్వహించారు. ఇక జూన్ 6 న వివాహం చేసుకున్న అఖిల్ తన పెళ్లిపై ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ కానీ పెట్టలేదు. తాజాగా అఖిల్ తన పెళ్లి ఫొటోస్ ను షేర్ చేస్తూ.. నా లైఫ్ లో అతి ముఖ్యమైన ఘట్టానికి సంబంధించి బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చెయ్యాలని నా మనసుకు అనిపించింది అంటూ పెళ్లి ఫొటోస్ షేర్ చేసాడు. 

పెళ్లి తర్వాత కామ్ గా ఉన్న అఖిల్ ఇప్పుడు పెళ్లయ్యాక ఇన్నాళ్లకు పెళ్లి ఫొటోస్ ని షేర్ చేయడంపై అక్కినేని అభిమానులు హ్యాపీ గా ఫీలయినా.. నెటిజెన్స్ మాత్రం కామెడీగా స్పందిస్తున్నారు. 

Akhil Akkineni First Post After Wedding

akhil