నోరు జారిన నటుడి దుస్తితి

మాట పొదుపు చాలా ముఖ్యం. దీని ప్రాధాన్యతను తెలుసుకోకపోతే ఎంతటివాడైనా ఫలితం అనుభవించాల్సిందే. నోరు జారితే దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ నటుడు రామ్ కపూర్ కి అలాంటి పరిస్థితి వచ్చింది. అతడు తన తాజా చిత్రం మిస్త్రీ ప్రమోషన్స్ లో అసభ్యకర వ్యాఖ్యలతో విసిగించాడని ఇంతకుముందే కథనాలొచ్చాయి.
అతడు ఇంటర్వ్యూల సమయంలో అదుపు తప్పాడు.. నోరు జారాడు.. ఇష్టానుసారం మాటలు విసిరేసాడు. షో మార్కెటింగ్ టీమ్‌లోని ఒక పురుష ఎగ్జిక్యూటివ్‌ను ముద్దు పెట్టుకోవడం గురించి పదే పదే వ్యాఖ్యలు చేశాడని, అతడి తల్లి తనను కనేందుకు గర్భం దాల్చకుండా పడుకోవాల్సింది! అని సూచించాడని కూడా తెలుస్తోంది. జర్నలిస్టులు గ్యాంగ్ రేప్ చేస్తారని కూడా అతడు వ్యాఖ్యానించాడు. అతడు కుళ్లు జోకులు వేశాడు. లైంగిక భంగిమలను కూడా ప్రస్తావించాడు.
వేదిక వద్ద ఉన్న కొందరు మహిళా సిబ్బంది దుస్తులపై కొంటెగా వ్యాఖ్యానించాడు. వారు అలా విప్పుకు తిరిగితే ఎలా చూడకుండా ఉంటారు! అంటూ వ్యాఖ్యానించినట్టు ఆంగ్ల మీడియాలు కథనంలో పేర్కొన్నాయి. అయితే అతడి వ్యాఖ్యల గురించి ఫిర్యాదులు అందడంతో చిత్రబృందం అతడిని ప్రమోషన్స్ నుంచి తొలగించింది. రామ్ కపూర్ సహ నటి మోనా మాత్రమే ఆ తర్వాత మిస్త్రీ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిస్త్రీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతం రామ్ కపూర్ పై చర్యలు తీసుకునేందుకు చిత్రనిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు.
Ram kumar dropped from mistry movie promotions
Ram Kapoor in chaos for making sexual comments







































