ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhanda Godavari: Pawan Kalyan new look viral

డిప్యూటీ సీఎం లుక్ ఇంత స్టయిలిష్ గానా..

Akhanda Godavari: Pawan Kalyan new look viral

ఏపీ పాలిటిక్స్ లో ప్రస్తుతం కీలకంగా మారిన జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా వైట్ కుర్తా-పైజామాలోనే కనిపిస్తారు. ఏ అఫీషియల్ కార్యక్రమామైనా అలాంటి వైట్ అండ్ వైట్ లోనే పవన్ హజరవుతారు. కానీ ఈ రోజు జరిగిన అఖండ గోదావరి అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కనిపించారు.

రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించిన అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హీరో లుక్కుతో వెళ్లి అందరినీ సర్ ప్రైజ్ చేసారు. గోదావరి తీరం వెంట పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ది కోసం అఖండ గోదావరి పేరిట కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ లుక్ పై మాత్రం సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ ఎన్నాళ్ళయింది ఆయన్ని ఇంత స్టైలిష్ గా చూసి అంటూ సంబరాడిపోతున్నారు. 

Pawan Kalyan new look in Akhanda Godavari event

pawan kalyan