100 కోట్ల కుబేర
Dhanush Kuberaa crosses Rs 100 crore markశేఖర్ కమ్ముల దర్శకత్వంలో గత శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కుబేర. వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లోను కుబేర అద్భుతమైన కలెక్షన్స్ కోల్లగొట్టడమే కాదు.. నాలుగు రోజులు పూర్తయ్యేలోపు కుబేర 100 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా అడుగుపెట్టింది.
ధనుష్, నాగార్జున, రష్మిక ల పెరఫార్మెన్స్, దేవిశ్రీ మ్యూజిక్, శేఖర్ కమ్ముల దర్శకత్వానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవడంతో కుబేర కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. దానితో ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులు పూర్తయ్యేలోపు కుబేర ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా కుబేర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కుబేర 100 కోట్ల పోస్టర్ చూసి మూవీ లవర్స్ మాత్రమే కాదు చాలామంది ఎన్నాళ్ళయింది.. టాలీవుడ్ లో 100 కోట్ల పోస్టర్ చూసి, మళ్లీ కుబేర తో ఇప్పుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Dhanush Kuberaa crosses Rs 100 crore mark in just 4 days







































