వెంకీ- త్రివిక్రమ్ కాంబో స్టార్ట్ అయ్యేది అప్పుడే
Venkatesh - Trivikram Movie Starts From August 2025సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తదుపరి మూవీని ప్రకటించడంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. ఈమద్యలో రానా-నాయుడు వెబ్ సీరీస్ తో వెంకీ అభిమానులను డిజప్పాయింట్ చేసారు. రానా-నాయుడు లో వెంకీ కేరెక్టర్ పై అభిమానుల్లో అసంతృప్తి కనిపించింది.
ఇక వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్టు ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నారనే వార్త వినిపించినా.. ఈ ప్రాజెక్ట్ పై నాగవంశీ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చారు కానీ.. అఫీషియల్ గా ప్రకటించలేదు. తాజాగా త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ తో వెంకీ తో కలిసి ఆగష్టు లో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట.
ఆగష్టు లో వెంకీ-త్రివిక్రమ్ కాంబో మూవీ పూజ కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మరి తివిక్రమ్-వెంకీ కాంబో మొదటిసారి పట్టాలెక్కుతోంది, వీరి కలయికలో ఎలాంటి క్రేజీ మూవీ రాబోతుందో అని మూవీ లవర్స్ అందరూ చాలా క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు.
Venkatesh and Trivikram film likely to go on floors in August 2025







































