Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> He returned again without working out as a hero

హీరోగా వర్కౌట్ అవ్వక మళ్ళీ తిరిగొచ్చాడు

He returned again without working out as a hero

హీరోగా వెలిగిపోవాలని చాలామందికి ఉంటుంది. అందుకే అవకాశం వస్తే చాలు బిగ్ స్క్రీన్ పై తమని తాము చూసుకునేందుకు రెడీగా ఉంటారు. హీరో అయ్యేందుకు ఏళ్ళ తరబడి వేచి ఉండాలన్నా ఉండిపోతారు. బుల్లితెర పై పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై పాపులారయ్యాం.. సిల్వర్ స్క్రీన్ పై కూడా వెలిగిపోదామనుకున్నాడు. 

రెండుసార్లు ట్రై చేసాడు. రెండుసార్లు ప్రదీప్ మాచిరాజుకు టైమ్ కలిసి రాలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ హీరోగా ఒకసారి ప్రయత్నం చేసాడు. ఆ సినిమా నిరాశపరిచింది. లాంగ్ బ్రేక్ తీసుకుని ఢీ షో కి యాంకర్ గా మారిన ప్రదీప్ మళ్ళీ వెండితెరపై ఓ రాయి వేసాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ పవన్ కళ్యాణ్ టైటిల్ తో అదృష్టాన్ని వెతుకున్నాడు. 

ఆ సినిమా కూడా ప్రదీప్ మాచిరాజుని బాగా డిజప్పాయింట్ చేసింది. హీరో గా లక్కు కలిసొస్తే సిల్వర్ స్క్రీన్ పైనే ఉండిపోయేవాడు. కానీ వర్కౌట్ అవ్వక కాస్త కుదురుకుని మళ్లీ బుల్లితెరపై అడుగుపెట్టేసాడు. స్టార్ మా లో కూకూ విత్ జాతిరత్నాలు అంటూ కొత్త షో కి యాంకర్ గా వచ్చేసాడు. మరోసారి ప్రదీప్ మాచిరాజు సందడి బుల్లితెరపై స్టార్ట్ అయ్యింది. 

Cooku With Jathirathnalu to premiere on June 28

pradeep