Advertisement

త‌మిళ తంబీల్ని ఉర్రూత‌లూగించిన ప‌వ‌ర్‌స్టార్

జ‌న‌సేనాని, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ హిందూ వాదిగా, భార‌తీయ సంస్కృతి మూలాల గురించి ప్ర‌చారం చేస్తూ, కూట‌మి త‌ర‌పున‌ ప్ర‌తినిధిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీ నాయ‌కులు హిందూ దేవుళ్ల విష‌యంలో అప‌రాధులుగా ప్ర‌పంచానికి ఆవిష్కృత‌మ‌య్యారు. నాస్తిక‌త్వం పేరుతో హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రుస్తూ డీఎంకే ప్ర‌తినిధులు కామెంట్లు చేయ‌డంపై ప‌వ‌న్ సీరియ‌స్ అవుతూనే ఉన్నారు. డీఎంకే నాయకుడు ఉద‌య‌నిధితోను ప‌వ‌న్ వార్ ఆఫ్ వ‌ర్డ్స్ గురించి తెలిసిందే.

ఇదిలా ఉంటే మ‌ధురైలోని కీల‌క ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి మ‌ఖ్య అతిథిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌త్యేక‌మైన చాప‌ర్ లో మ‌ధురై విమానాశ్ర‌యానికి చేరుకున్న ఫోటోల వీడియోలు వైల‌ర్ గా మారుతున్నాయి. ప‌వ‌న్ వైట్ అండ్ వైట్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా విమానాశ్ర‌యం లో క‌నిపించారు.

సుబ్రమణ్యస్వామి .. మురుగన్ కు అసాధార‌ణ భ‌క్తులు ఉన్న‌ తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జ‌రిగిన‌ `మురుగ భక్తర్గల్ మానాడు` కార్యక్రమంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు.  ప‌వన్ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం అద్భుత‌ స్పీచ్ తో ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రుస్తూ కొంద‌రు చేస్తున్న అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేస్తామ‌నే ఆవేశం ప‌వ‌న్ స్పీచ్ లో క‌నిపించింది.  హిందూ విశ్వాసాలను, ముఖ్యంగా మురుగన్ భక్తులను ఎగతాళి చేసే రెచ్చగొట్టే వారిని ఆయన హెచ్చరించారు. కొంద‌రు హిందువుల‌ను కించ‌ప‌రిచేలా వేర్పాటు వాద ధోర‌ణితో ఉన్నార‌ని ప‌వ‌న్ ఫైర్ అయ్యారు. డీఎంకే ను నేరుగానే ఆయ‌న టార్గెట్ చేసార‌ని ఈ స్పీచ్ విన్న‌వారికి అర్థ‌మ‌వుతుంది. స్వ‌యం ప్ర‌క‌టిత నాస్తికులు హిందువుల‌ను అవ‌హేళ‌న చేయ‌డం మానుకోవాల‌ని కూడా హిత‌వు ప‌లికారు

త‌మిళ దేవుడు మురుగ‌న్,  ఉత్తరాదిన కార్తికేయ, ఆంధ్ర , కర్ణాటకలో సుబ్రమణ్య స్వామి.. దేవుడు ఏ రూపంలో ఉన్నా నేను  ప్రార్థిస్తున్నాను.. అందుకే మధురైలో మురుగన్ సమావేశం జరుగుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక సాధువు కోపంగా ఉంటే, అడవి కూడా నిలబడదు! అని ఆయన హెచ్చరించారు. హిందువులు తమ విశ్వాసాల విష‌యంలో గర్వం వ్యక్తం చేయడానికి సిగ్గుపడకూడదని కూడా అన్నారు. కంద షష్టి కవసం వంటి భక్తి కీర్తనలను అపహాస్యం చేసినట్లు గతంలో జరిగిన సంఘటనలను ఆయన ఖండించారు. అలాంటి చర్యలను తమిళ హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు.

దేవుడిని నమ్మని వారికి లౌకికవాదం అనేది అనుకూలమైన పదం. కానీ మన నాస్తికులు, ఏ దేవుడిని నమ్మకుండా ఉన్నారా? హిందూ దేవుళ్లను మాత్రమే నమ్మరు. లౌకికవాదులు హిందూ మతం తప్ప మరే ఇతర మతంపైనా వివక్ష చూపరు. హిందూ మతం తప్ప మరే మతాన్ని ఎత్తి చూపే ధైర్యం వారికి లేదు. రాజ్యాంగం వారికి వాక్ స్వాతంత్య్రం అనే గొప్ప ఆయుధాన్ని ఇచ్చింది.. దానిని వారు మన దేవుళ్లకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు అని ప‌వ‌న్ అన్నారు.

Pawan Kalyan Tamil Look is Adhurs!

Power Star enthralls Tamil fans
pawan kalyan