Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nagababu comments on Niharika second marriage

నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు కామెంట్స్

Nagababu comments on Niharika second marriage

మెగా డాటర్ నిహారిక పెద్దలు చూపించిన చైతన్య జొన్నలగడ్డని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని.. వ్యక్తిగత విభేదాలతో భర్త చైతన్య కు డివోర్స్ ఇచ్చి విడిపోయింది. కారణం నిహారిక పబ్ లో పట్టుబడడమే చైతన్య-నిహారిక మద్యన విభేదాలు రావడానికి కారణాలు అంటూ ఉంటారు. తాజాగా నాగబాబు నిహారిక రెండో పెళ్లి పై అలాగే ఆమె మొదటి పెళ్లి, అది బ్రేకప్ అవడం పై స్పందించారు. 

నిహారిక మొదటి పెళ్లి విషయంలో మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, మేము చూపించితిన అబ్బాయిని ఓకే చేసింది, అందులో తనిష్టం ఏమి లేదు, మేము ఇద్దరి విషయంలో ప్రోపర్ గా జెడ్జి చేయలేకపోయాము. ఇద్దరికీ సెట్ అవ్వలేదు, విడిపోయారు. తాను విడిపోతాము అంది, నేను ఓకే అన్నాను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేను పిల్లల జీవితాల్లో కలుగజేసుకోను. 

ప్రస్తుతం తాను నిర్మాతగా సినిమాలు స్టార్ట్ చేసింది. ఎప్పుడోకప్పుడు తను ఓ అబ్బాయిని కలుస్తుంది. తన జీవితంలోకి అతన్ని ఆహ్వానిస్తుంది. పెళ్లి చేసుకుని సెటిలవుతుంది అంటూ నాగబాబు నిహారిక రెండో పెళ్లి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అంతేకాదు చైతన్య తో వివాహం విషయంలోనూ నాగబాబు సంచలనంగా మట్లాడారు. 

పెద్ద వారిగా నిహారికకు మంచి జరుగుతుంది అని మేము అబ్బాయిని చూపించాము, మా కోసం ఓకే అంది, అంతేకాని అది తన స్వంత ఇష్టం కాదు. అబ్బాయి, అమ్మాయి పెళ్లితో కలిసుండాలని కోరుకుంటాము. కలిసి ఉండలేకపోతే మనం ఏం చెయ్యగలం. కలిసి ఉండాలా, లేదా అనేది వారి డెసిషన్. కానీ నేనెప్పుడూ వారి మధ్యన సిమెంట్ వెయ్యాలనుకోలేదు, అలాగని అగ్గి వెలిగించలేదు అంటూ నిహారిక-చైతన్యల నడుమ విడాకుల విషయంలో నాగబాబు ఓపెన్ అయ్యాయి. 

Naga Babu about Niharika Konidela Divorce

naga babu