Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Another huge hit for this heroine this year

ఈ హీరోయిన్ కి ఈ ఏడాది మరో భారీ హిట్టు

Another huge hit for this heroine this year

ప్రస్తుతం రష్మిక మందన్న టైమ్ నడుస్తుంది. హిందీలో క్రేజీ కాదు కాదు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్నకు అక్కడ యానిమల్, పుష్పా 2, ఛావా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ పడడంతో రష్మిక హావ పెరిగిపోయింది. ఇటు తెలుగులోనూ రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారింది. తృటిలో రాబిన్ హుడ్ లాంటి డిజాస్టర్ ని తప్పించుకున్న రష్మిక సల్మాన్ తో సికందర్ లాంటి భారీ డిజాస్టర్ కి దొరికిపోయింది. 

ఈ ఏడాది విక్కీ కౌశల్ తో కలిసి హిందీలో ఛావా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అది కూడా తమిళ హీరో, తెలుగు డైరెక్టర్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ కుబేర తో రష్మిక హిట్ ని అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన కుబేర జూన్ 20 న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వైపులా నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. 

రష్మిక గ్లామర్ గా కనిపించకపోయినా, సింపుల్ గానే కనిపించినా ఆమె పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవడము, కథకు అవసరం కావడంతో రష్మిక పాత్ర ను శేఖర్ కమ్ముల అందంగా మలిచారు. ఆ పాత్రలో రష్మిక ఒదిగిపోయి నటించింది. కుబేర హిట్ లో భాగమైంది. కుబేర చిత్రం కలెక్షన్స్ పరంగా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో కాస్త వేచి చూస్తే తెలుస్తుంది. 

అలా రష్మిపై మందన్న ఖాతాలో ఛావా, కుబేర లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఒకే ఏడాది పడ్డాయన్నమాట. లక్ అంటే రష్మికదే కదా.!

Rashmika Mandanna Riding High With Raining Hits!

rashmika