Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Yogandhra event in Visakhapatnam sets Guinness world record

విశాఖ యోగాంధ్ర కు గిన్నిస్ రికార్డ్

Yogandhra event in Visakhapatnam sets Guinness world record

విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించింది. విశాఖలో చేపట్టిన యోగాంధ్ర కోసం ఏపీ లోని పలు ప్రాంతాల నుంచి యువత, ప్రజలు భారీఎత్తున పాల్గొనడానికి యోగ డే సందర్భంగా సుకృవరం సాయంత్రం, అలాగే జూన్ 21 శనివారం ఉదయం తెల్లవారు ఝామున 4 గంటల నుంచే చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిధిగా హాజరవడమే కాదు.. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మినిస్టర్ నారా లోకేష్ తదితరులు యోగాసనాలు వేశారు. 

విశాఖ సాగర తీరంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశాం. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. 

యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌ నినాదంతో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. యోగ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి, ఆరోగ్యం అంటే యోగ, యోగ అంటే ఆరోగ్యం. యోగాసనాలతో ప్రతి ఒక్కరూ హెల్దీ గా ఉండాలని, యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని, యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని ప్రధాని మోడీ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు మట్లాడుతూ.. యోగ అంటే కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, దానితో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని, యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని, స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా విశాఖలో రికార్డు సృష్టించబోతున్నామని, 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్లాడుతూ.. మోడీ సమక్షంలో, చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని, యోగా విశిష్ఠతను రుగ్వేదం చెబితే.. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. 

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశాం. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం మనకు గర్వకారణం అన్నారు. 

Yogandhra Creates History

yogandhra