కుబేర చుట్టూ పాజిటివ్ రివ్యూస్

Positive reviews around KuberaaPositive reviews around Kuberaa

శేఖర్ కమ్ముల చిత్రాలకు ఓ వర్గం ఆడియన్స్ వీరాభిమానులు ఉంటారు. లీడర్, ఆనంద్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల నాలుగేళ్ళ గ్యాప్ తో హీరో ధనుష్-నాగార్జున తో చేసిన కుబేర చిత్రం నేడు జూన్ 20 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన ప్రమోషన్స్ లేవు, అదిరిపోయే టికెట్ బుకింగ్స్ లేకుండానే కుబేర థియేటర్స్ లో విడుదలైంది. 

కానీ కుబేర ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతోనే పోజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది, సోషల్ మీడియాలో ఎటు చూసినా కుబేర గురించిన కబుర్లే కనిపిస్తున్నాయి. ధనుష్ యాక్టింగ్ వేరే లెవల్, కింగ్ నాగార్జున అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చారు, రష్మిక ప్రాణం పెట్టి తనపాత్ర ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా  చేసింది, శేఖర్ కమ్ముల మేకింగ్ స్టయిల్ కి మరోసారి ఫిదా అంటూ కుబేర ను వీక్షించిన ఆడియన్స్ సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు మాత్రమే కాదు.. 

కుబేర చిత్రం చూసాక క్రిటిక్స్ కూడా కుబేర చిత్రానికి అదిరిపోయే రేటింగ్స్ తో రివ్యూస్ ఇవ్వడంతో పాటుగా, శేఖర్ కమ్ముల దర్శకత్వాన్ని, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ నటనను, నాగార్జున కేరెక్టర్ ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఒకవైపు ఆడియన్స్ కుబేర కు ఇస్తున్న పాజిటివ్ టాక్, మరోపక్క క్రిటిక్స్ ఇస్తోన్న పాజిటివ్ రిపోర్ట్స్ అన్ని కుబేర కు ప్లస్ అవడమే కాదు, ఇకపై కుబేర కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాడనికి దోహదపడతాయనడంలో సందేహం లేదు. 

Kuberaa audience responce

kuberaa