Advertisement

అఖిల్ లెనిన్ స్టోరీ రివీల్డ్

అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఒక్క హిట్ ఒకే హిట్ అంటూ ఎదురు చూస్తున్నాడు. మొదట్లో వరసగా సినిమాలు చేసినా అన్ని డిజపాయింట్ చేసే కథేలే అఖిల్ కి తగిలాయి. ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్, అసలేందుకు సూపర్ హిట్ కూడా అవ్వలేదు. ఏజెంట్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని ఆచి తూచి విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ ఫేమ్ ముర‌ళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ మొదలు పెట్టాడు. 

లెనిన్ షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దినెలలకే తన ప్రేయసి జైనబ్ ని వివాహం చేసుకుని అఖిల్ వ్యక్తిగత జీవితంలో కూడా సెటిల్ అయ్యాడు. తాజాగా అఖిల్ లెనిన్ స్టోరీ లైన్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. లెనిన్ కథ పరువు హ‌త్య నేప‌థ్యంలో సాగే క‌థ అని, అందులోనే ఓ పురాతన ఆలయానికి సంబంధించిన క‌థ కూడా నడుస్తుంది అని, ఆ రెండిటిని దర్శకుడు ఎలా మిక్స్ చేశార‌న్న‌ది ఆస‌క్తిక‌రం అంటున్నారు. 

అఖిల్ గతంలో ఎన్నడూ చెయ్యని కేరెక్టర్ ని లెనిన్ చిత్రంలో చేస్తున్నాడు. లెనిన్ గా అఖిల్ ఫస్ట్ లుక్ అఖిల్ బర్త్ డే సందర్భంగా రివీల్ చెయ్యగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల జోడి కడుతుంది. అయితే లెనిన్ లో కింగ్ నాగార్జున అఖిల్ తో నిజ జీవిత పాత్ర లో కనిపిస్తారని ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది

Akhil Lenin update

Akhil Lenin story revealed
akhil