ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anil Ravipudi Introduces Nayan In Style

అందుకే నయనతార ఒప్పుకుందా

లేడీ సూపర్ నయనతార ఎంత కమర్షియల్ అన్న విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో నటించమే కానీ ప్రమోషన్స్ కి వెళ్ళదు, అది నా సెంటిమెంట్ అనే నయనతార.. తన భర్త విగ్నేష్ సినిమాలకు వచ్చి సినిమాని ప్రమోట్ చేస్తుంది. మిగతా వారు ఎంత మొత్తుకున్నా ససేమిరా, అది నా సెంటిమెంట్ అంటుంది. అలాంటి నయనతార మెగాస్టార్ చిరు - అనిల్ రావిపూడి కాంబోలో మొదలైన #Mega 157 చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే ప్రమోషనల్ వీడియో తో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ప్రమోషన్స్ విషయంలో లెక్క చెయ్యని నయనతార ఇలా #Mega 157 ప్రాజెక్ట్ లోకి రావడం రావడమే సినిమాని ప్రమోట్ చెయ్యడం షాకిచ్చేలా చేసింది. అయితే నయనతార అంత పెద్దమనసు చేసుకుని అనిల్ రావిపూడి తో కలిసి #Mega 157 ఎంట్రీ ప్రమోషన్ చేసింది కూడా డబ్బు తీసుకునే అట. 

నయనతారకు #Mega 157 కి ఇచ్చే పారితోషికానికి రెండు కోట్లు అదనంగా యాడ్ చెయ్యడం వలనే నయనతార #Mega 157 ని ప్రమోట్ చెయ్యడానికి ఒప్పుకుంది అని, #Mega 157 షూటింగ్ అయ్యాక కూడా సినిమా రిలీజ్ కి ముందు ప్రతి ఈవెంట్ లోను నయనతార ఉండేలా ప్లాన్ చేసి అనిల్ రావిపూడి నిర్మాతల చేత ఆమెకు రెండు కోట్లు అదనంగా ఇప్పించబట్టే నయన్ అలా చేస్తుందట. 

ఈ లెక్కన నయనతార ఫ్రీగా, పెద్ద మనసు చేసుకుని #Mega 157 ప్రమోట్ చెయ్యడం లేదు, కేవలం డబ్బు కోసమే డ్యూటీ చేస్తుంది అన్నమాట. 

Nayanthara promotions For Mega157

Anil Ravipudi Introduces Nayan In Style
nayanthara