Loading...

అనిల్ మాయలో విశ్వంభరను వదిలేసారు

Clarity needed for Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మాయలో పడి వసిష్ఠ తో చేసిన విశ్వంభరను వదిలేశారా, లేదంటే విశ్వంభర విషయాలు పక్కనపెట్టి ఆయన అనిల్ రావిపూడి షూటింగ్ లో బిజీ అవ్వరు కదా, విశ్వంభర విషయాలు అరా కొర బయటికి వస్తే.. అనిల్-చిరు #Mega 157 అప్ డేట్స్ సోషల్ మీడియాలో రోజుకొకటి చక్కర్లు కొడుతోంది. 

ఇప్పుడు కూడా విశ్వంభర రిలీజ్ తేదీపై మెగా ఫ్యాన్స్ యుద్ధం చేస్తూనే #Mega 157 అప్ డేట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభర విషయం ఆల్మోస్ట్ మరిచిపోయేలా ఉన్నారు సినీ జనాలు. అటు అనిల్ రావిపూడి షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ఫినిష్ చేస్తూ ఇప్పుడు కూడా ముస్సోరి లో #Mega 157 షూటింగ్ జరుగుతున్న అప్ డేట్, ఆ సెట్ లో హీరోయిన్ నయనతార జాయిన్ అయిన అప్ డేట్ లు ఇస్తూ అనిల్ రావిపూడి సినిమాపై క్రేజ్ పెంచుతున్నాడు. 

వసిష్ఠ విశ్వంభర వీఎఫ్ ఎక్స్ పనుల్లో ఎంతగా బిజీగా వున్నా సినిమా రిలీజ్ తేదీనో లేదంటే సినిమాకి సంబందించి ఏదో ఒక హైప్ క్రియేట్ చేసే అప్ డేట్ ఇస్తేనే.. విశ్వంభర సోషల్ మీడియాలో ట్రెండవుతుంది. లేదంటే అనిల్ మాయలో విశ్వంభరను వదిలేసినా వదిలేస్తారు సుమీ..!

Vishwambhara Release Date Uncertain Again?

vishwambhara