వీరమల్లు రిలీజ్ OG పై ఎఫెక్ట్ చూపుతుందా
Will Veeramallu release have an effect on OG?పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రాలు వరసగా విడుదలై అభిమానులకు కిక్ ఇస్తాయి అనుకుంటే. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్ర రిలీజ్ పై కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా వీరమల్లు పదే పదే వాయిదా పడుతూ అభిమానుల సహనాన్ని పూర్తిగా నశించేలా చేస్తుంది. కేవలం అభిమానులకే కాదు వీరమల్లు రిలీజ్ తేదీ ప్రకటించకపోవడం ఆయన తదుపరి చిత్రమైన OG పై పడుతుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.
జూన్ 12 హర హర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఆ లెక్కనే OG మేకర్స్ మూడు నెలల గ్యాప్ లో అంటే సెప్టెంబర్ 25 న OG రిలీజ్ అంటూ సుజిత్, దానయ్య లు ప్రకటించారు. వీరమల్లు జూన్ 12 వచ్చేస్తే లెక్క సరిపోయేది కానీ.. జూన్ 12 నుంచి హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియకుండా పోయింది.
అలా హరి హర వీరమల్లు తేదీ OG రిలీజ్ కి దగ్గర్లో ఉంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా OG పై పడుతుంది అని అభిమానులే కాదు, OG మేకర్స్ కూడా టెన్షన్ పడుతున్నారని సన్నిహితుల సమాచారం. మరోపక్క హరి హర వీరమల్లు రిలీజ్ పై ఆసక్తి పెరగడం మానేసి అసలు ఇంట్రెస్ట్ ని తగ్గించేస్తుంది. అలా కూడా వీరమల్లు కి ఎఫెక్ట్ అనే చెప్పాలి.
Hari Hara Veeramallu vs OG







































