Loading...

చీరకట్టులో క్యూట్ గా బుట్టబొమ్మ

Pooja Hegde saree look goes vira1

బుట్టబొమ్మ పూజ హెగ్డే రెట్రో తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇద్దామని ఆశపడితే.. ఆ చిత్ర రిజల్ట్ పూజ హెగ్డే ను తీవ్రంగా నిరాశపరిచింది. పూజ హెగ్దే-సూర్య కలయికలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం పూజ హెగ్డే స్టార్ హీరో విజయ్ లాస్ట్ చిత్రం జన నాయగన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. 

ఇకపోతే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పూజ హెగ్డే తాజాగా శారీ ఫొటోస్ షేర్ చేసింది. రీసెంట్ గా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకలో మెరూన్ కలర్ శారీ లో మురిపించిన పూజ హెగ్డే ఇప్పుడా ఫోటోస్ ని  సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

పూజ హెగ్డే ఆ శారీ లుక్ లో నిజంగానే బుట్టబొమ్మలా కనిపించింది. వావ్ బ్యూటిఫుల్ పూజ హెగ్డే అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.  

Pooja Hegde latest look viral

pooja hegde