రాజా సాబ్ కి అదనపు ఆకర్షణ గ్లామర్ డోస్
Raja Saab extra charm is a dose of glamourపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ టీజర్ రీసెంట్ గానే విడుదలై అభిమానులను ఇంప్రెస్ చేసింది. రాజా సాబ్ పై ఉన్న అనుమానాలన్నీ మారుతి టీజర్ తోనే ఎగరగొట్టేసారు. రాజా సాబ్ టీజర్ ని పెద్ద ఎత్తన అభిమానుల నడుమ విడుదల చేసి అందరి చూపు రాజా సాబ్ పై పడేలా అటెన్షన్ క్రియేట్ చేసారు మేకర్స్.
రాజా సాబ్ టీజర్ లో సంజయ్ దత్ తాత గా మనవడిగా ప్రభాస్ కనిపించగా.. డార్క్ కామెడీ, హర్రర్ కామెడీకి అదనపు అకర్షణగా హీరోయిన్స్ గ్లామర్ ని మారుతి యాడ్ చేసారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ ఇలా ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ చూపించడంలో నువ్వా నేనా అంటూ పోటీపడ్డారు.
మాళవిక మోహనన్ తో ప్రభాస్ రొమాంటిక్ కామెడీ, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ తో ప్రభాస్ రొమాన్స్ అన్ని రాజా సాబ్ టీజర్ లో హైలెట్ అవడమే కాదు అదనపు ఆకర్షణగా కనిపించారు. మరి మారుతి కూడా ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ ఓ సాంగ్ లో ఆడిపాడనున్నారని చెప్పారు. సో ప్రభాస్ సరదాగా మారుతిని ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టమంటే మారుతి ఏకంగా ముగ్గురు గ్లామర్ డాల్స్ ని ప్రభాస్ కోసం దించినట్లుగా రాజా సాబ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే రివీల్ చేసారు.
Raja Saab teaser highlights







































