కొడాలి నాని జైలుపై పేర్ని నాని కామెంట్స్

Perni Nani About Kodali Nani Arrest Perni Nani About Kodali Nani Arrest

వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా.. కన్నుమిన్ను కానకుండా కారుకూతలు కూసిన నేతలను, అలాగే అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఏరి మరీ జైలులో వేస్తుంది. అధికార మదంతో కొట్టుకుంటూ చేసిన కామెంట్స్, అక్రమ సంపాదనకు కూటమి ప్రభుత్వంలో తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు.   

అయితే వల్లభనేని వంశీ, నందిగం సురేష్, బోరుగడ్డ ఇలా ఎంతమంది అరెస్ట్ అయినా.. పేర్ని నాని, కొడాలి నాని లని ఇంకా అరెస్ట్ కాకపోవడంతో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం కనిపిస్తుంది. కొడాలి నాని ఎప్పడెప్పుడు జైలుకు వెళ్తాడా అని వారు ఎదురు చూడని రోజు లేదు, కారణం వైసీపీ ప్రభుత్వం మంత్రి పదవి చూసుకుని రెచ్చిపోయిన కొడాలి నాని అంటే టీడీపీ అభిమానులకు మహా మంట . 

కాని కొడాలి నాని జైలు కెళ్ళకుండా ఆసుపత్రుల వెంట తిరగడమే వాళ్లకు నచ్చడం లేదు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నాని జైలు కెళ్ళే సమయం పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనకున్న అంచనా ప్రకారం ఇంకో ఆరు నెలల్లో కొడాలి నాని అరెస్ట్ అవుతారని అన్నారు, నారా లోకేష్ రెడ్ బుక్ లెక్కల ప్రకారం.. కొడాలి నాని అరెస్ట్ కోసం ఇంకొంత కాలం కూటమి ప్రభుత్వం ఆగుతుంది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం బాగా లేదు, రీసెంట్ గానే ముంబైలో ఆయనకు హార్ట్ సర్జరీ జరిగింది, ఒకవేళ అరెస్ట్ చేసినా అనారోగ్య కారణాలు చూపించి నాని బెయిల్ తీసుకుని బయటకొచ్చేస్తారు. 

అలా జరక్కుండా నాని ని కొన్నాళ్ళు జైల్లోనే పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు, నాని ఆరోగ్యం మెరుగుపడి, జిమ్ అదీ చేసి బలంగా తయారైతే.. అప్పుడు సమయం చూసి ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, దానికోసం ఆరు నెలల టైం పట్టొచ్చని పేర్ని నాని కొడాలి నాని అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చారు.

Perni Nani on Kodali Nani Arrest

perni nani