ఫ్రెగ్నెంట్ కియరాకు ఊరగాయ పచ్చడి కానుక
Ram Charan Send Mango Pickle To Kiaraబాలీవుడ్ నటి కియారా అద్వానీ టాలీవుడ్ లోను పాపులర్ కథానాయిక. మహేష్, చరణ్ లాంటి స్టార్ల సరసన నటించింది. ఈ భామ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పుడు తొలి బిడ్డ కోసం ఎదురు చూస్తోంది.
తాజా సమాచారం మేరకు... తన గేమ్ ఛేంజర్ సహనటుడు రామ్ చరణ్, అతడి భార్య ఉపాసన కొణిదెల అత్తమ్మ కిచెన్ నుంచి పుల్లపుల్లని ఐటమ్‌ని కియరా కోసం పంపారు. ఉపాసన, ఆమె అత్తగారు సురేఖ కొణిదెల స్థాపించిన `అత్తమ్మాస్ కిచెన్` నుండి కాబోయే మామ్ కియారాకు ఇంట్లో తయారుచేసిన మామిడికాయ ఊరగాయను పంపారు. వారు ప్రేమగా పంపిన ఊరగాయతో కియారా అద్వానీ తన కోరికలను తీర్చుకోనుంది.
తాజాగా తనకు అందిన మామిడికాయ ఊరగాయ ప్యాకేజీ ఫోటోని షేర్ చేసిన కియరా తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టార్ కపుల్ కి ధన్యవాదాలు తెలిపింది. ప్యాకేజీతో పాటు తనకు ఒక అందమైన నోట్ కూడా అందినట్టు తెలిపింది. అందులో ఇలా రాసి ఉంది. ``ప్రియమైన కియారా.. నా అత్తమ్మ (అత్తగారు) నుండి ప్రేమతో... మా మామిడికాయ ఊరగాయ ప్రత్యేక రుచిని ఆస్వాధించండి. ప్రేమతో తయారు చేసినది.. మా వంటగది నుండి నేరుగా.. మీకు పంపాము. మీరు దీన్ని ఆస్వాధిస్తారని ఆశిస్తున్నాను. అనంతమైన ప్రేమతో..`` అని రాసారు. దానికి కియరా అందమైన ప్రతిస్పందన ఆకట్టుకుంది. రామ్ చరణ్ - ఉపాసన కొణిదెలలకు కృతజ్ఞతలు చెబుతూ.. కియారా ఇలా రాశారు. ``ధన్యవాదాలు నా ప్రియతమలు!`` అని రాసారు.
ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `గేమ్ ఛేంజర్`లో కియారా అద్వానీ - రామ్ చరణ్ జంటగా నటించారు. చాలా అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఫ్లాపవ్వడం నిరాశపరిచింది.
Ram Charan Gifted homemade mango pickle To Pregnant Kiara Advani







































