Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Revanth Reddy, Balakrishna, Allu Arjun in single frame

సింగిల్ ఫ్రేమ్ లో రేవంత్-బాలయ్య-బన్నీ

సింగల్ ఫ్రేమ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నందమూరి నట సింహ బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం అభిమానులకు కిక్ ఇచ్చింది. ఈ అరుదైన దృశ్యం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ లో చోటు చేసుకుంది. జూన్ 14 శనివారం సాయంత్రం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా మొదలైన ఈ వేడుకకు హీరోయిన్స్ అయితే సీతాకోక చిలుకల మాదిరి రెడీ అయ్యి రెడ్ కార్పెట్ పై నడిచారు. 

ఇక ఈ ఈవెంట్ కి అతిధులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్లో బెస్ట్ యాక్టర్స్ గా అవార్డు అందుకోవడానికి అల్లు అర్జున్, బాలకృష్ణ వచ్చారు. వీరు కలిసి కూర్చున్నప్పుడు ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అది చూసే రేవంత్ రెడ్డి-బాలయ్య-అల్లు అర్జున్ ముగ్గురు సింగిల్ ఫ్రేమ్ లో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, జయప్రద, సుహాసిని, కృతి శెట్టి, రీతూ వర్మ, FDA చైర్మన్ గా దిల్ రాజు లాంటి సెలబ్రిటీస్ కనిపించగా.. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ప్రస్తుతం ఇంకా జరుగుతుంది, చాలామంది సెలబ్రిటీస్ ఈ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యే అవకాశముంది. 

Telangana Gaddar Film Awards 2025 update

Revanth Reddy, Balakrishna, Allu Arjun in single frame
revanth reddy